తాళ్లూరి పంచాక్షరయ్యను కలిసిన మంత్రి తుమ్మల
బూర్గంపాడు,మే14,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్యను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరవెండిలోని ఆయన స్వగృహానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాములవారి దర్శనం అనంతరం ఇరవెండి చేరుకొని పంచాక్షరయ్యను కలిశారు.
తన నివాసానికి వచ్చిన తుమ్మలను సాదరంగా ఆహ్వానించిన పంచాక్షరయ్య శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు పంచాక్షరయ్యతో కొద్దిసేపు మాట్లాడి స్థానిక పరిస్థితులపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరుపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తాళ్లూరి రాధాకృష్ణ,తాళ్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






