24 August, 2026 | 11:46 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు

20-06-2025 12:00 AM

ఎస్పీ మహేష్ బి.గితే 

రాజన్న సిరిసిల్ల: జూన్ 19 (విజయక్రాంతి)గురువారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. 

పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్‌ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని,రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలని , ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలనీ అధికారులను ఆదేశించారు.

నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పకడ్బందీగా జారీ చేయాలి.ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు.

నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుందిఅన్నారు.జిల్లా వ్యాప్తంగా ముమ్మర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తరుపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 06 గంటల నుండి 08 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుదని,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు జరిమనలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో సి.ఐ లు కృష్ణ,మొగిలి,శ్రీనివాస్,వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.