4 July, 2026 | 12:32 PM

మట్టి పాత్రల్లో.. వంట చేస్తే!

21-05-2024 12:05 AM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. అందుకు ఉపయోగించే పాత్రలు కూడా ఎలాంటివో ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిల్లో వంట చేసి తినడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటిల్లో వంట ఫాస్ట్‌గా అయిపోతుందని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలు సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి... ఆలోచించి మట్టి పాత్రలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూర్వం వంటకు ఎక్కువగా మట్టి పాత్రలనే ఉపయోగించేవారు. ఇప్పుడు మళ్లీ మట్టి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరిలో ఆరోగ్యంపై కూడా అవగాహన పెరిగింది. మరి మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలసుకుందాం.

* రుచిగా ఉంటాయి: మట్టి పాత్రల్లో వండటం వల్ల వంటలు రుచిగా ఉంటాయన్న విషయం చాలా మందికి తెలుసు. వీటిల్లో వంట చేయడం వల్ల మట్టి వంటకు రుచిని జోడిస్తుంది. దీంతో మీరు చేసే వంటకు రుచి, సువాసన వస్తాయి.

* వంటలు చెడిపోవు:  మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. త్వరగా పాడవ్వవు. ఆహారం చెడిపోకుండా మట్టిలో ఉండే పోషకాలు హెల్ప్ చేస్తాయి. మీరు వంటలు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

* గర్భీణీలకు మంచిది: మట్టి పాత్రల్లో గర్భిణీలు భోజనం చేస్తే చాలా మంచిది. మట్టి పాత్రల్లో 100 శాతం మైక్రో న్యూట్రియన్స్ లభిస్తాయి. అంతే కాకుండా మట్టి పాత్రల్లో ఇన్విజబుల్ రేస్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి పుట్టే బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వాళ్లు ఆరోగ్యంగా పుట్టేలా చేస్తాయి. ఇంతే కాకుండా మట్టి పాత్రల వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.