31 August, 2026 | 10:07 PM

Breaking News

ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •   వెలుగొండకు నికర జలాలు మళ్లిస్తే తెలంగాణకు దుర్దినం   •   బాచ్పన్‌లో ఉత్సాహభరితంగా స్పోర్ట్స్ డే వేడుకలు   •  

ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..

21-05-2024 02:12 AM

ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్

న్యూఢిల్లీ, మే 20: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఇటీవల ఖాతాదారులకు వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి. సాధారణ ఎస్‌ఎంఎస్ రూపంలోనూ ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే వాటిపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఎస్‌బీఐ అప్రమత్తం చేసింది. తమ బ్యాంకు రివార్డు పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్‌బీఐ స్పందిస్తూ రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంలి లింకులు పంపలేదని, ఇకపై పంపబోమని స్పష్టం చేసింది. ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోబోమని తెలిపింది.

వాట్సాప్ లేదా ఎస్‌ఎం ఎస్ ద్వారా లింకు వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. అసలేం జరిగిందంటే.. ఎస్‌బీఐ రివార్డుల లింకు వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. తెలిసిన వారి నంబర్ల నుంచే వస్తుండటంలో దాన్ని చూసిన వారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ సూచిస్తోంది.