4 July, 2026 | 11:58 AM

పెద్దమల్లారెడ్డిలో డొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి నిర్వహణ

04-07-2026 11:16 AM

భిక్కనూర్, జూలై 4(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు డొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కొమురయ్య త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండలరెడ్డి, కురుమ సంఘం కేవైసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల స్వామి వెంకయ్య, కురుమ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.