calender_icon.png 2 February, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షమాపణ చెప్పకుంటే తీవ్రంగా పరిగణించేవాళ్లం

04-10-2024 01:43:18 AM

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందన

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించామని తెలిపింది. అయితే మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్య లను వెనక్కు తీసుకొన్నందున, ఈ వ్యవహారంలో ఇక తమ పాత్ర అవసరం లేదని భావిస్తున్నట్టు వెల్లడించింది.