8 July, 2026 | 4:00 PM

స్టాక్ మార్కెట్లపై ట్రంప్ వార్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

08-07-2026 03:20 PM
  1. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన..
  2. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది..
  3. ఇరాన్‌ వి క్షమించరాని తప్పులు
  4. చర్చల పేరుతో ఇరాన్‌ సమయం వృథా
  5. ఇరాన్ తో చర్చలు అనవసరం
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తో సంప్రదింపులు మాత్రం కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ ఒక్క ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు షాక్..! భారత స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. మీ పెట్టుబడులపై ప్రభావం ఎంత?


ఇరాన్ తో చర్చించడం అనవసరం అనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇరాన్‌ క్షమించరాని తప్పులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ చర్చల పేరుతో ఇరాన్‌ సమయం వృథా చేస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. తుర్కియే అంకారాలో జరిగిన నాటో సదస్సులో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇరాన్ పై అమెరికా దాడులు, ట్రంప్ వ్యాఖ్యలతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర 75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1800 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

FAQ's

ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోయాయి?
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో భారత స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 1800 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

ట్రంప్ ఏమి ప్రకటించారు?
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

సెన్సెక్స్ ఎందుకు పడిపోయింది?
ట్రంప్ వ్యాఖ్యలు, యుద్ధ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది.

నిఫ్టీ ఎంత నష్టపోయింది?
నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడైంది.

ముడి చమురు ధర ఎంత?
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు సుమారు 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Related Articles: