17-02-2026 12:00:00 AM
ఉద్యమకారునికి మరోసారి అన్యాయం అంటూ కార్యకర్తల నిరసన
కౌన్సిలర్ గెలుపులో ప్రతాప్ రెడ్డి కీలకం - పార్టీ వర్గాల వెల్లడి
గజ్వేల్, ఫిబ్రవరి 16: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మొదలైన చైర్మన్ ఎన్నిక రాజకీయం బిఆర్‌ఎస్ పార్టీని వేడెక్కించింది. అప్పటికే చైర్మన్ పదవికి ఉద్యమకారుడు క ళ్యాణ్ కర్ నరసింగరావు పేరు ప్రచారం కాగా క్యాంపు రాజకీయంలో చర్చలు రసవత్తరంగా కొ నసాగాయి. ప్రతాప్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగిశెట్టి రవీందర్ పేరు సైతం ఎన్నికల ప్రచారం నుండే చర్చలో ఉంది.
శుక్రవారం రాత్రి నుండి కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చర్చలో ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ కు చెందిన 11వ వార్డు కౌన్సిలర్ భవాని కరుణాకర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ముగ్గురి విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి వంటేరు ప్రతాప్ రెడ్డి తీసుకువెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ తో చర్చించిన క్రమంలో నర్సింగరావు, రవీందర్ ల ఒత్తిడి తీవ్రమైంది.
ఈ క్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి తన ముఖ్య అనుచరుడు గంగిశెట్టి ర వీందర్ కు చైర్మన్ పదవిని ఇవ్వాలని, లేనిపక్షంలో తాను, తన అనుచరులు భారీ సంఖ్యలో పా ర్టీకి రాజీనామా చేస్తానని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పలువురు చర్చించుకున్నారు. పార్టీ భవిష్యత్తును, పార్టీకి ప్రతాప్ రెడ్డి అవసరాన్ని గుర్తించి అధిష్టానం గంగిశెట్టి చందన రవీందర్ ను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా కళ్యాణ్కర్ పద్మా బాయ్ నరసింగరావును వైస్ చైర్మన్ గా బలపరుస్తూ విప్ ను జారీ చేశారు.
కాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుండగానే అధిష్టాన నిర్ణయం స్థానిక పార్టీ వర్గాలకు తెలియడంతో సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. ఆ వెంటనే నరసింగరావు, అతని అనుచరులు , ఉద్యమకారులు ప్రతాప్ రెడ్డి వల్ల ఉద్యమకారుల అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ల గెలుపులో ప్రతాప్ రెడ్డి కీలకం - పార్టీ వర్గాల వెల్లడి
బిఆర్‌ఎస్ పార్టీలో ఓవైపు వంటేరు ప్రతాపరెడ్డి వ్యవహార శైలిపై నిరసనలు కొనసాగుతుండగానే, మరోవైపు పార్టీ వర్గాలు ప్రతాపరెడ్డి పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వంటేరు ప్రతా ప్ రెడ్డి వల్లే నియోజకవర్గంలోని అధిక సర్పంచులను గెలుచుకోవడం తోపాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఓడిపోయినచోట్ల పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వంటేరు ప్రతాపరెడ్డి ప్రత్యర్థులకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు కూడా రావడం గమనార్హం.