17 August, 2026 | 1:25 AM

ఆ మహిళల గురించి తెలుసుకుంటే..

30-10-2024 12:00 AM

ప్రతి సినిమా మంచి విజయం సాధించడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సంయుక్త మీనన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటోందీ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడింది.

“ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ‘ఎవ్వరూ రొమ్ము క్యాన్సర్‌ను ఒంటరిగా ఎదుర్కొనకూడదు’ అనే నినాదాన్ని డబ్ల్యూహెచ్‌వో ఈ సంవత్సరం రొమ్ము క్యాన్సర్ అవగాహనా థీమ్‌గా ఎంచుకుంది.

మేము నిర్వహించే క్యాంపెయిన్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి నయం చేసే అవకాశాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అలాగే కొందరు మహిళలు ధైర్యం, దృఢ సంకల్పంతో ఈ వ్యాధి నుంచి బయటపడి ఎంత సంతోషంగా ఉన్నారనేది తెలుసుకుంటే మనకు స్ఫూర్తిదాయకంగా కూడా అనిపిస్తుంది. క్యాన్సర్ వ్యాధిపై పోరాడే వారికి సేవలందిస్తున్న సంస్థ దయకు సంకేంతంగా నిలుస్తోంది” అని తెలిపింది సంయుక్త.