17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

29-03-2025 09:59 AM

చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ శ్రీకాంత్

చేగుంట,విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట పట్టణం(Chegunta town)లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.

 ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని, తాను ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు.అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ముస్లిం సోదరులు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,  సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు