12 July, 2026 | 4:25 PM

Breaking News

పచ్చని భవిష్యత్తుకు హైదరాబాద్‌లో గ్రీన్ ప్రాపర్టీ షో

05-05-2024 12:05 AM

సీఐఐ  ఐజీబీఎస్ ఆధ్వర్యంలో 17, 18, 19 తేదీలల్లో నిర్వహణ

సీఐఐ నేషనల్ వైస్ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 4 (విజయక్రాంతి): శనివారం హైదరాబాద్ నగర ప్రజల పచ్చని భవిష్యత్తు కోసం హైదరాబాద్ కేంద్రంగా గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని సీఐఐ  ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2024 మే 17, 18, 19 తేదీలల్లో మూడు రోజు ల పాటు ఐజీబీసీ రెండవ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన భవిష్యత్తు తరాలు గ్రీన్ హోంలను కొనుగో లు చేయాలనే సంకల్పంతో ‘ది కీ టు ఏ గ్రీన్ ఫ్యూచర్’ ప్రధా నాంశంగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నామని తెలిపా రు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాకారంతో గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. సుస్థిర అభివృద్ధిలో హైదరాబాద్ నగ రం గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, వనరుల పరిరక్షణ అనే రాష్ర్ట ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల్లో ఈ విషయంపై అవగా హన కల్పించడం, గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించడం తమ లక్ష్యం అని ఆయన తెలిపారు. గ్రీన్ ప్రాపర్టీ షోల ద్వారా ఆరోగ్యకరమైన, సంతోషకరమై న జీవితాన్ని గడపడం, ఖర్చు, ఇంధన ఆదా, సహజ వనరుల సమర్థవంతమైన వినియోగం పరంగా సుస్థిరమైన ప్ర యోజనాలు కలుగుతాయన్నారు. ప్రాప ర్టీ యజమానులు, కాబోయే కొనుగోలుదారులు, మదుపరులు, అద్దెదారులు అన్ని పరిశ్రమల వాటాదారులకు గ్రీన్ ప్రాపర్టీ షో అం దుబాటులో ఉంటుందన్నారు. ప్రముఖ డెవలపర్లకు ఈ ప్రాపర్టీ షో సరై న ప్లాట్‌ఫామ్ అని, ఈ అవకాశాన్ని ఉప యోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో-ఛైర్మన్ జి. శ్రీనివాస్ మూర్తి, ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ ఎంఆనంద్, ఐజీబీసీ సీనియర్ కౌన్సెలర్ సందీప్ వుల్లికంటి పాల్గొన్నారు.