12 July, 2026 | 4:43 PM

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట

12-07-2026 04:06 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. రాజ్ కుమర్ కోసం 9 బృందాలతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హత్య చేసిన రోజు నిందితుడు ఉపయోగించిన కారును, రంగారెడ్డి జిల్లా చేగురు రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తించి, రైల్వే ట్రాక్ దాటి అడవిలోకి వెళ్లినట్లు అనుమానం. శుక్రవారం రాత్రి 11.47కు సొంతూరిలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించి, రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీసులు, ట్రాకింగ్ టీమ్స్ తో కలిసి కారు లభించిన ప్రాంతం సమీపంలోని అడవిలో పోలీసులు బృందాలు గాలిస్తున్నారు. రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల బహుమతిని పోలీసులు ప్రకటించారు.