12 July, 2026 | 5:23 PM

Breaking News

జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •   ఎస్‌ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయండి   •   నాని ఈవీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి   •   పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన డీఈవో   •   ముత్తారంలో 52 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన 1974 బ్యాచ్ విద్యార్థులు   •  

రిజిస్ట్రేషన్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం

05-05-2024 12:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2023 మొదటి నాలుగు నెలలతో పోల్చితే 2024 మొదటి నాలుగు నెలలో 22,142 డాక్యుమెంట్లు తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే రియల్ ఆదాయం 2023తో పోల్చితే సుమారు 260.22 కోట్లు  పెరిగింది.  అలాగే 2022 వార్షిక సంవత్సరంలో మొత్తం 12,07,065 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, తద్వారా రూ.10,669.46 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 2023 వార్షిక సంవత్సరంలో 12,01,899 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగగా, తద్వారా రూ. 11,275.17 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 5,166 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు తగ్గాయి. ఆదాయం మాత్రం గత ఏడాదితో పోల్చితే రూ.605.71 కోట్ల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తగ్గడం రియాల్టర్లను ఆందోళన కలిగించే అంశం.