18-02-2026 12:39:59 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఐఐటి జేఈఈ 2026 మొదటి విడత పరీక్ష ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో జాతీయస్థాయిలో పర్సంటైల్ సాధించారు. సిహెచ్. లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలువగా, వి. శ్రేయాస్ రెడ్డి 99.83, కె.ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి.లిఖిత్ సాయి 99.6, ఏ. సత్య వర్ధన్ 99.6. జి.ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాష్ 99.38, బి.శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్.ప్రణయ్నీ రెడ్డి 99.13, వి.సుహాని 99.111 సాధించారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు.
99 పర్సం టైల్, ఆపై 12 మంది విద్యార్థులు, 90 పర్సం టైల్ ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. రెండవ విడత ఫలితాలలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను, ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని అభినందించారు.