ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 28(విజయక్రాంతి):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించుకోవాలని వారు సూచించారు.
మేడ్చల్ ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత గ్రామాల రైతులకు ఈ కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలిపారు.వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,సమయానికి సేకరణ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు వారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు కూడా తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు శుభ్రపరచి కేంద్రానికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మునిసిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి.ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి.అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు కురుమ.తుంకి భిక్షపతి మున్సిపల్ కౌన్సిలర్ లు ఆరిఫ్.శ్రీలత రమేష్ యాదవ్.మాజీ కౌన్సిలర్ చాపరాజు.నాయకులు సద్ది ప్రకాష్ రెడ్డి ,మాజీ కౌన్సిలర్లు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్.కౌడే మహేష్ కురుమ.మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి.పిఏసిఎస్ మాజీ చైర్మన్ అంతిరెడ్డి.మాజీ డైరెక్టర్ లు మెట్టు వెంకట్ రాంరెడ్డి.సత్యనారాయణ రెడ్డి.నాయకులు నడికొప్పు రంజిత్ ముదిరాజ్.కాలేరు శ్రీకాంత్ వంజరి.వేముల రంజిత్ రెడ్డి.స్థానిక ప్రజా ప్రతినిధులు.ఐకేపీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.






