విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట
మఠంపల్లి, ఏప్రిల్ 28: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాత దొనబండ తండా గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది పర్యటించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను సిబ్బంది సహాయంతో తొలగింపజేశారు.
ఈ సందర్భంగా ఏఈ హరీష్ రెడ్డి,సర్పంచ్లు బానోతు ఘుమ మంద నాయక్ తో కలిసి సోమవారం మాట్లాడుతూ వర్షాకాలం సమయంలో విద్యుత్ షాక్ గురై ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలకు గోడలు తడిసినప్పుడు పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త పడాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలపై ఏఈ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ రంగారావు,మాజీ సర్పంచ్ హనుమా నాయక్,ఉప సర్పంచ్ భూక్యా దూబ్ల నాయక్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,విద్యు త్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






