30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

17-03-2026 12:15 AM

ములకలపల్లి,మార్చి 16 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగుగులోత్ శంకర్ నాయక్ కోరారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ భాగ్యలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి దివ్యాంగులకు పెన్షన్లు వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు.ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నివాస,ఆదాయ, కుల దృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని అనేక ప్రభుత్వ పథకాలకు ఈ పత్రాలే ప్రమాణికం కావడంతో నిర్ణీత  సమయంలో ధృవీకరణ పత్రాలను జారీచేసి అర్హులు అయిన పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చీకటి ప్రకాష్,ఎస్టి మోర్చా అధ్యక్షులు బానోత్ మల్లేష్, అప్పారావు, కార్యదర్శి జాటోత్ రవి  నునవత్ శంకర్, బోడా హరిబాబు, బోడ చంద్ర కుమార్, ధరావత్ నరేష్,వంకుడోత్ పవన్, గుగులోత్ రాము తదితరులు పాల్గొన్నారు.