ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి
సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని ప్రతి ఓటరికి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టినట్లు చేగుంట మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు పట్టణ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ తెలిపారు.సోమవారం పట్టణం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఎస్ఐఆర్ సంబంధించిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సరిగా నమోదైందో లేదో, తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
అవసరమైతే నిర్ణీత గడువులోపు సవరణలు, మార్పులు చేసుకోవాలని కోరారు.ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేదా అనుమానాలు లేకుండా సరైన సమాచారం అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అందుకే పట్టణం లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నామని తెలిపారు.ఈ ప్రక్రియలో ఓట ర్లకు అవసరమైన సహాయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని, ఏవైనా సందేహాలు ఉంటే బీఎల్ ఓలు, బీఎల్ ఏలను,సంప్రదించి వెంటనే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని పిలుపునిచ్చారు.






