calender_icon.png 13 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులు ఎత్తి వేయాలి

13-11-2025 12:11:10 AM

లక్షేట్టిపేట, నవంబర్ 12: తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు బుధవారం ఆందోళన నిర్వహించారు. సమస్య వివరించడానికి వెళితే కేసులు పెడుతున్నారని, దండేపల్లి తహసీల్దార్ తమ వినతి పత్రం తీసుకోలేదని ఆదివాసులు ఆరో పించారు. అక్కడి నుంచి తాళ్ళ పేట్ రేంజ్ కు వెళితే అక్కడి అధికారులు కూడా పట్టించుకోలేదని, సంబంధిత అధికారులు లక్షేట్టిపేటలో ఉన్నారని తెలపడంతో ఇక్కడికి వచ్చినట్లు వివరించారు.

దమ్మన్నపేటకు చెందిన ఆదివాసీలు లక్షేట్టిపేటలో ర్యాలీ తీసే క్రమంలో అటవీ శాఖ అధికా రులకు, ఆదివాసీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో ఆదివాసీలకు, అటవీ శాఖ సిబ్బందికి గాయాలైనట్లు తెలిసింది. ఉత్కూర్ చౌరస్తా వద్ద ఓ ఆదివాసీ మహిళకు ఫీట్స్ రావ డంతో ఆసుపత్రికి తరలించారు. విధులకు ఆటంకం కలిగించి తమ సిబ్బందిపై దాడి చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ అనిత తెలిపారు. పలువురు అటవీ శాఖ అధికారులను గాయపర్చిన ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.