calender_icon.png 13 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాదే గెలుపు

13-11-2025 12:09:27 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

ముకరంపుర, నవంబర్,12 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 15 రోజులుగా పార్టీ ఆదేశానుసారంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగిం దని తెలిపారు. అలాగే కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన మా అభ్యర్థి కర్ర రాజశేఖర్ అధ్యక్షుడిగా, డైరెక్టర్లుగా ఎన్నుకున్న అర్బన్ బ్యాంక్ ఖాతా దారులకు అభినందనలు తెలిపారు.

బ్యాంకు అభివృద్ధికై శాయశక్తుల సహాయపడతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో, నగరపాలక సంస్థల ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచు లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లలో నెహ్రూ విగ్రహం, పీవీ నరసింహారావు విగ్రహం జిల్లా మంత్రులు శాసనసభ్యుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు.