calender_icon.png 7 October, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లంపేట్ విజయలక్ష్మి విల్లాస్ లో అక్రమ నిర్మాణాలు..

07-10-2025 07:15:47 PM

గతంలో హైడ్రా కూల్చివేతలు..

మళ్ళీ తిరిగి అక్రమ విల్లాల నిర్మాణాలు..

అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోండి..

దుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎమ్ఆర్ఓ కి ఆకుల సతీష్ ఫిర్యాదు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): మల్లంపేట్ సర్వే నెంబర్ 170/3,4 లో జిఎల్ఎస్ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నందు మళ్ళీ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి ఎఫ్టిఎల్/బఫర్ జోన్ లో నిర్మాణాలు చేయడంపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎమ్ఆర్ఓ కి ఆకుల సతీష్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ మల్లంపేట్ గ్రామం, జిఎల్ఎస్ కాలనీ గతంలో బిల్డర్ విజయలక్ష్మి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి, కత్వ చెరువు ఎఫ్ టి ఎల్/బఫర్ జోన్లో విల్లాలు నిర్మించారని అన్నారు. అయితే ఆ విల్లాలు చెరువు ఎఫ్ టి ఎల్/బఫర్ జోన్ లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి అక్రమ విల్లాలను హైడ్రా కూల్చివేసింది. ప్రభుత్వ భూమి,చెరువు ఎఫ్ టి ఎల్/బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేసిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని విజయలక్ష్మిపై పోలీస్ కేసు కూడా నమోదు నమోదయ్యింది.

కానీ సంవత్సర కాలం తర్వాత ఇదే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ చేపట్టిన జిఎల్ఎస్ కాలనీ నందు రోడ్డు నెంబర్ 11, 10 మధ్యలో దాదాపు ఎకరం స్థలంలో సర్వేనెంబర్ 170/3,170/4కు సంబంధించిన ప్రభుత్వ భూమిలో టి ఎస్ బి పాస్ ఇన్స్టంట్ ఒక అనుమతితో ఆరు విల్లాల నిర్మాణలు గత నెల రోజులుగా జరుగుతున్నాయి. 3 విల్లాల నిర్మాణానికి టీ ఎస్ బి పాస్ ఇన్స్టంట్ ద్వారా అనుమతులు పొందిందని, కానీ ఏమైందో మున్సిపల్ అధికారులు వాటిని రద్దు చేశారని అన్నారు. ఒక అనుమతితో శ్రీ వినాయక రియాల్టర్స్, డెవలపర్స్ పేరుతో అనుమతులు పొంది నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. గతంలో ఇదేవిధంగా సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి చెరువులో నిర్మాణాలు, కొనుగోలు చేసిన ప్రజలు పడిన ఇబ్బందులు చూసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఒకే ఒక తప్పుడు అనుమతితో ఆరు విల్లాల నిర్మాణం జరుగుతున్న చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే అనుమతుల్లేని, ప్రభుత్వ భూమి, కత్వ చెరువు ఎఫ్ టి ఎల్/బఫర్ జోన్ లో నిర్మాణాలు చేస్తున్న శ్రీ వినాయక రియాల్టర్స్, డెవలపర్స్ నిర్మాణ పనులను నిలిపివేసి, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చందు, పాండు, శ్రీనివాస్ ఉన్నారు.