calender_icon.png 7 October, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదానం

07-10-2025 07:19:21 PM

చిలుకూరు: ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల బారిన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్నారు. అందుకే ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం కోసం ఎదురుచూసే వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మన మొదటి కర్తవ్యమని మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామాపురం గ్రామానికి చెందిన నిదానపు వెంకటయ్య(60) మోకాలు సంబంధించిన ఆపరేషన్ కి రక్తం అవసరం రాగ మైత్రి ఫౌండేషన్ సభ్యులు రామాపురం గ్రామానికి చెందిన నిదానపు సోమయ్య, నిదానపు అంజి రక్తదానం చేయడం జరిగింది. రక్తం దానం చేసిన సభ్యులను ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ జబ్బార్, ఉపాధ్యక్షులు బట్టు కెవల్ పంత్, ప్రచార కార్యదర్శి షేక్ మీరా, కోశాధికారి అంజి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నరేష్, కోదాడ కిక్రెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిక్, గోల్లపుడి శ్రీకాంత్ మొదలగువారు అభినందించారు.