బామనకుంటలో అక్రమ తవ్వకాలు
పటాన్‌చెరు, మే 22 (విజయక్రాంతి) : జిన్నారం మండలం గడ్డపో తారం పంచాయతీలోని అల్లీనగర్ గ్రామ పరిధిలో బామన కుంట శిఖం లో పట్టపగలే అక్రమ తవ్వకాలు చేపట్టారు. సర్వే నంబర్ 27లో పరిశ్రమ ఏర్పాటుకు పొందిన స్థలంలో బామ న కుంటలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం గ్రామ స్తులు మట్టి తవ్వకాలను అడ్డుకోని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్దిసేపు మట్టి తవ్వకాలు ఆపినట్లే ఆపి మళ్లీ చేపట్టారు. అధికారులకు ఫిర్యాదు చేసిన మట్టి తవ్వకా లు చేపట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సర్వే నంబర్ 27లో తాతల నాటి నుంచి సాగు చేసుకుంటున్న తమ పొలాలను దౌర్జన్యంగా తీసుకున్నారని, వాటికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని మాజీ ఉపసర్పంచ్ మమత పెంటేశ్ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను విన్నవిస్తామన్నారు.






