20 August, 2026 | 4:55 PM

ఘనంగా దొడ్ల వెంకటేష్‌గౌడ్ జన్మదిన వేడుకలు

23-05-2024 04:33 AM

కూకట్‌పల్లి, మే 22 (విజయ క్రాంతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. డివిజన్ పరిధిలోని గోదా కృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలో పేద ప్రజలకు వెంకటేష్‌గౌడ్ కొరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, డివిజి ట్రస్టు ద్వారా పేదవారిని ఆదుకొని వారికి అండగా నిలుస్తున్నాడని కొనియాడారు. జన్మదిన వేడుకల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్‌గౌడ్, రంజిత్‌రెడ్డి సోదరుడు నరేంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్లు జానకిరామరాజు, భానుప్రసాద్, యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, డివిజన్ నాయకులు సమ్మారెడ్డి, అనిల్‌రెడ్డి, మోజెస్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.