18 July, 2026 | 1:35 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

పనామా హోటల్‌లో అక్రమ వలసదారులు

19-02-2025 11:09 PM

న్యూఢిల్లీ: అమెరికా నుంచి తరలిస్తున్న అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు పనామా ప్రకటించింది. వారందరికీ ఒక హోటల్‌లో బస ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరినట్లు పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో వెల్లడించారు. వారంతా భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ సహా వివిధ దేశాలకు చెందిన వారుగా వెల్లడించారు. అయితే, వారిలో 40 శాతం మంది తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బహిష్కరణకు గురైన వారిని ఓ హోటల్లో బంధించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అబ్రెగో ఖండించారు.