calender_icon.png 19 February, 2026 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ మావాళ్లే!

19-02-2026 01:53:35 AM

పట్ట పగలే వాగుళ్ళో ఇసుక స్వాహ 

రైతుల పొలాలు నాశనం

అక్రమంగా గ్రామాలకు తరలింపు

జెసిబి లతో లోతైన డంపు

పట్టించుకోని అధికారులు

జెసిబి సీజ్ - కేసు నమోదు

గోపాలపేట/ ఏదుల ఫిబ్రవరి 18: అందరూ మావారే మాకు అడ్డు చెప్పేవారు ఎవరుంటారు. లేఅంటూ ఇక మాఫియా అక్రమ వ్యాపారులు పొట్ట పగలే వాగుల్లో ఇసుక తోడేస్తున్నారు. వనపర్తి జిల్లా ఏదుల మం డల కేంద్రంలో గ్రామ శివారులో ఉన్న తురుకదినే వాగులో నిత్యం అక్రమ వ్యాపారు లు జెసిబి లతో వారి ఇష్టానుసారంగా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా రు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు ఉంటున్నారని ఆ పరిసర ప్రాంత రైతులు వాపోతున్నారు.

రైతుల పొలాల్లో ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుండo పట్ల పొలాలు పాడవుతున్నాయని. రైతులు తాసిల్దార్ కు రెవిన్యూ అధికారులకు చెప్పిన రామకు రిటర్న్ గా ఫిర్యాదు రాసిస్తే చూస్తామని చెప్పినట్లు రైతులు చెబుతున్నారు. ఇస్కామాపియదారులు గ్రామానికి సం బంధించిన వారే కనుక ఎవరు కూడా ధైర్యంతో ముందుకు వచ్చేది చేయలేకపోతున్నారు. గురువారం సంబంధిత తాసిల్దార్ కు సమాచారం అందడంతో స్పందించిన తాసిల్దార్ తన సిబ్బందిని వెంటనే తురుకదినే వాగు దగ్గరకు వెళ్లారు.

పట్టపగలే జెసిబి తో ట్రాక్టర్లలో ఇసుక తర లిస్తున్న దృశ్యాన్ని చూసి అధికారులే అబ్బర పోయారు. ఎవరి ధైర్యం చూసుకొని ఇలా పట్టపగలే వాగుల్లో ఇసుక తీయడం ఆశ్చర్యపోయారు. రెవిన్యూ అధికారులు జెసిబి ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్త్స్ర జగన్మోహన్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జే సీబీ ఓనర్ జయప్రకాష్, ట్రాక్టర్ యజమాని వీరపాగ నాగమ్మ భర్త వెంకటయ్య లపై కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర జగన్మోహన్ తెలిపారు.

అక్రమ ఇసుక తరలిస్తే చర్యలు

అక్రమ ఇసుక తరలిస్తే చర్యల. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి అవసరమున్న ఇసుకను గ్రామపంచాయతీ పర్మిషన్ తీసుకున్న వారు మాత్రమే అవసరానికి ఇసుకను తెచ్చుకోవచ్చు కానీ ఇలా అక్రమ వ్యాపారులు వారిష్టానుసారంగా యంత్రాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం.

తాసిల్దార్ మల్లికార్జున్