calender_icon.png 19 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత లేని భోజనం మాకొద్దు..

19-02-2026 01:56:06 AM

పీజీ కళాశాల విద్యార్థుల నిరసన

కొల్లాపూర్ టౌన్ ఫిబ్రవరి 18: నాణ్యతలేకుండా వడ్డించే భోజనం తినలేమంటూ కొల్లాపూర్ పీజీ కళాశాల విద్యార్థులు బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కళాశాల ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ కళాశాల హాస్టల్లో మేనూ పాటించం లేదన్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాతపూర్వకంగా ప్రిన్సిపల్ కి వినతి పత్రాన్ని అందజేసినప్పటికీ మెనూలో పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన భోజనం అందించకపోవడంతో గత నెల 26న ఇద్దరమ్మాయిలు కుప్పకూలిపడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లోకి విషసర్పాలు వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని కానీ సమస్యలను సృష్టించే విధంగా ప్రిన్సిపల్ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసన కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పాటుతో కాసేపు పోలీసులకు విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. తక్షణమే నాణ్యతమైన భోజనాన్ని అందించి హాస్టల్లో నెలకొనే సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం ఆది. కళాశాల అధ్యక్షులు కార్యదర్శిలు విలాస్ శివ. విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.