ఇసుక దందాపై పోలీసుల పంజా

05-10-2026 | 05:30am
  1. ఉలిక్కిపడ్డ ఇసుక మాఫియా చోర్లు 
  2. నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో రాత్రి వేళ ఇసుక దందా

కొత్తగూడెం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలంలో అక్రమ ఇసుక దందా(Illegal Sand Mining) తీవ్ర  స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  హమాలీ కాలనీలో వెలిసిన భారీ ఇసుక కుప్పలే ఇందుకు నిదర్శనం. మొర్రేడు వాగును నిలువునా తోడేస్తూ,అర్ధరాత్రి వేళల్లో నంబర్ ప్లేట్లు  లేని ట్రాక్టర్లతో యదేచ్ఛగా అక్రమ రవాణా చేపడుతున్న బడాబాబులు, ఇసుక రాబందులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.   

మండల అధికారులు చూసి చూడనట్టు,  కళ్ళు మూసుకొని ఉంటారని భావించిన అక్రమ ఇసుక రవాణా దారుడికి చుక్కెదురైంది. లక్ష్మీదేవిపల్లి మండలం దాటి కొత్తగూడెం పట్టణంలోకి అడుగుపెట్టిన నెంబర్ ప్లేట్ లేని టాక్టర్ను మూడో పట్టణ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.   అర్ధరాత్రి జరిపిన మెరుపు దాడిలో నంబర్ ప్లేట్ లేని  ట్రాక్టర్ను అదుపులోకి తీసుకోవడంతో ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎంపీ ఆదేశాలకే దిక్కు లేదు.. స్థానిక అధికారుల తీరుపై నిలదీత!

ఉమ్మడి చాతకొండ పంచాయతీ పరిధిలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై స్వయంగా ఎంపీ రామసహాయం రఘురామ్రెడ్డి స్థానిక పోలీసు, రెవెన్యూ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో ఇసుమంతైన  మార్పు రాకపోవడం, అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. లక్ష్మీదేవిపల్లి అధికారులకు చేతకాని పనిని, త్రీటౌన్ పోలీసులు చేసి చూపించారు అంటూ  ప్రజలు పట్టణ పోలీసులను పొగడ్తలతో ముంచేత్తారు.లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ శాఖల అధికారులు మాత్రం సమాధానం చెప్పలేక సందిగ్ధంలో పడ్డారు.

ఎవరు ఈ ఇసుక  చక్రవర్తులు?

అక్రమ సంపాదనకు అలవాటు పడి స్థానిక ప్రజల భద్రతను పణంగా పెడుతున్న, కొంతమంది రాజకీయ అండదండతో ఈ అక్రమ ఇసుక దందాలో నిలువునా మునిగితేలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  వాహనాలను అతివేగంతో నడుపుతూ  రాత్రి వేళల్లో ప్రజలను, భయభ్రాంతులకు గురిచేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అధికారులకు అనేకమార్లు సమాచారం ఉన్నప్పటికీ,ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

వీరి ఆగడాలకు పాపం పండింది అన్నట్లుగా చాతకొండ గ్రామపంచాయతీకి చెందిన  ఒక వ్యక్తి ట్రాక్టర్ను కొత్తగూడెం మూడో పట్టణ పోలీస్ శాఖ అదుపులోకి తీసుకోన్నారు. హమాలీ కాలనీ ప్రజలు ట్రాక్టర్ ను అడ్డగించి,  పోలీసుల కు పట్టించారు. దీనితో ఒక ట్రాక్టర్ లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో,మరొకరి ట్రాక్టర్ను కొత్తగూడెం త్రీటౌన్ స్టేషన్లో జప్తు కావడంతో అక్రమ ఇసుక దందాకు తాత్కాలికంగా చెక్ పడిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కలెక్టర్, ఎస్పీ, ఇకనైనా చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారా!

స్థానిక మండల స్థాయి అధికారులు కళ్లకు గంతలుజి కట్టుకుని కూర్చున్న వేళ..జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఈ అక్రమ ఇసుక డంపి్ంప పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. హమాలీ కాలనీలో వెలసిన భారీ ఇసుక కుప్పలపై తక్షణమే పంచనామా నిర్వహించి వాటిని సీజ్ చేయాలని అనుమతులు లేకుండా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ప్రతీ ట్రాక్ట్పనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీదేవి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  ఈ తాత్కాలిక ఇసుక అక్రమ రవాణా తెర పడుతుందో, లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు స్థానిక ప్రజలు..

మరిన్ని వార్తలు