25 May, 2026 | 10:26 PM

దోచుకున్నోడికి దోచుకున్నంత

25-05-2026 09:54 PM

* మంజీరాలో ఇసుకాసురులు

* పంట పొలాల్లో జోరుగా ఇసుక నిల్వలు

* పోలీసులు, పత్రికా రిపోర్టర్ల అండదండలతో జోరుగా ఇసుక అక్రమ రవాణా

నాగిరెడ్డిపేట,(విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నది పరిహాక ప్రాంత గ్రామాల్లో పోలీసులు, పత్రికా విలేకరుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా వ్యాపారం దోచుకున్నోడికి దోచుకున్నంతగా కొనసాగుతుంది. మంజీరానదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఇసుకాసురులు ఇదే మంచి అవకాశంగా భావించి గత వారం రోజులుగా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రివేళ ఇసుక తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించడమే కాకుండా, పంటపొలాల్లో జోరుగా డంపు చేస్తున్నారు.

మండలంలోని చీనూర్, వాడి, గోలి లింగాల్, పోచారం తదితర గ్రామాల శివారులో మంజీరా నదిలో అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాలో ప్రధానంగా కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు, పత్రిక విలేకరుల అండదండలు తో పాటు రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే రక్షకబడులు పత్రిక విలేకరులే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే సమాజం ఇంకా ఎక్కడ బాగుపడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మంజీరా నది నుండి తోడేస్తున్న ఇసుకను పలు గ్రామాల్లోని చుట్టూ ఉన్న పంట పొలాల్లో రాత్రివేళ డంప్ చేస్తు న్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. మంజీరా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు చేసుకుంటామని అధికారులు పేర్కొంటున్న సరైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంజీరా నదిలో నీటి మట్టం తగ్గిపోవ డంతో ఇసుకాసురులు మంచి అవకాశంగా భావించి అక్రమ తవ్వకాలు చేపడుతున్నార