6 May, 2026 | 10:19 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత

04-07-2025 01:24 AM

వెంకటాపురం నూగూరు, జూలై3(విజయ క్రాంతి):  చత్తీస్గడ్ రాష్ట్రం నుండి అక్రమంగా వెంకటాపురం తరలిస్తున్న గుడుంబాను వెంకటాపురం పోలీసులు గురువారం పట్టుకున్నారు. వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతి రావు కథనం ప్రకారం... చతిస్గడ్ రాష్ట్రం నుండి మండలానికి అక్రమంగా మద్యం రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు గురువారం ఉదయం ఎస్త్స్ర ఇద్దరు ప్రొ హిబిషనరీ ఎస్‌ఐలు, సిబ్బందితో   కలిసి తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంతో పాటు ఆటోలో తరలిస్తున్న 360 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఒక లక్ష 44 వేల రూపాయలు ఉంటుందని ఎస్‌ఐ తిరుపతి రావు తెలిపారు. వెంకటాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన  మల్లేష్ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన నిమ్మల మనోజ్ లను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఎవరైనా అక్రమ గుడుంబా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మండలంలో ఎవరైనా అక్రమ గుడుంబా తయారీ కామ వికలాయాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ తిరుపతిరావు ట్రైనీ ఎస్త్స్రలు తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.