calender_icon.png 4 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

04-07-2025 01:24:49 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 3 ( విజయ క్రాంతి ) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం గా ఆదిలాబాద్ లోని పలు వార్డులలో కనీస మౌలిక సౌకర్యాలు కరువయ్యాయని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. దింతో  వర్షాకాలంలో రోడ్లు, మురికి కాలువలు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు మున్సిపల్ లో ఇటీవల వీలినమైన వార్డుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ పరిధిలోని టైలర్స్ కాలనీ ఎమ్మెల్యే పర్యటించి అక్కడి పరిస్థితిపై అరా తీశారు.

మున్సిపల్ కమిషనర్ రాజు, బీజేపీ నాయకుల తో కలిసి కాలనీలో కాలినడకన తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రత్యేక తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుంది ఆశించినప్పటికి ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ఆరోపించా రు. రోడ్లు అన్ని గుంతలుగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

రోడ్లు, మురికాల్వలు, వార్డుల అభివృద్ధి తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృ ద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఎమ్మె ల్యే వెంట బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, గటిక క్రాంతి, శరత్ తదితరులు ఉన్నారు.