ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం
21-07-2026 08:56 PM
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, గ్యాస్ ప్రయోగించడం అమానుషమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ కుమార్ ఖండించారు. విద్యా వ్యవస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని, మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.






