11 August, 2026 | 1:43 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అనారోగ్యం తల్లి బిడ్డల ప్రాణాలు తీసింది

21-06-2025 12:00 AM

చెరువులో దూకి తల్లీ, కూతుళ్ల బలవన్మరణం

నిర్మల్ జూన్ 30 (విజయ క్రాంతి) : నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ కాలానికి చెందిన తల్లి కూతురు శుక్రవారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ  బలవనస్మరణానికి పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిం ది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ కాలనీకి చెందిన సుంకరి లక్ష్మీబాయి  80) , సుంకరి గౌరమ్మ (50) తల్లి కూతుర్లు ఒకే ఇంటిలో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.

వీరిద్దరూ తరచుగా అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో రోజురోజుకు మానసిక వేదనకు గురవుతున్నారు. అనారోగ్యం తో ఉన్న తాము ఎవరికి భారం కాకూడదన్న ఉద్దేశంతో  శుక్రవారం ఇంటి నుంచి బంగల్పేట చెరువులోకి వద్దకు వెళ్లిన వెళ్లారు. తల్లి కూతుర్లు చెరువు కట్టపై ఉన్న తూము వద్ద నీటిలో దూకడంతో ఇద్దరు మునిగిపోయా రు.

ఉదయం 8 అయిన లక్ష్మీబాయి గౌరమ్మ ఇంటి బయటకు రాకపోవడం ఇం టి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్ళగా వారు ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల తోటి బంధువులతో కలిసి వెతికారు. 11 గంటలకు ప్రాంతాల్లో బంగల్పేట చెరువులో మృతదేహాలు కనిపించడంతో పోలీ సులకు సమాచారం ఇచ్చారు ఘటన జరిగిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.