నీ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతుంటా!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తన గ్లామర్, క్యూట్ నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి లో విజయం సాధించలేకపోయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ పాపులారిటీతోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలావుంటే, భాగ్యశ్రీ-.. హీరో రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో నటిచింది.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్ర చారం జరిగింది. మే 15 హీరో రామ్ పోతినేని పుట్టినరోజు కావడంతో భాగ్యశ్రీ బోర్సే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో తమ మధ్య ఉన్న బంధంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది భాగ్యశ్రీ. “జీవితంలో మన ఎప్పుడూ ఎవరో ఒకరు స్ఫూ ర్తిగా నిలుస్తూ ఉంటారు. నిన్ను చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది.
నీలోని టాలెంట్, ఎనర్జీ చూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతుంటా. నీలాంటి ఒక గొప్ప వ్యక్తి నా పక్కన మంచి స్నేహితుడిగా ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావి స్తున్నా. థాంక్యూ సో మచ్. ఈ పుట్టినరోజు నుంచి నీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం ప్రారంభం కావాలి. ఈ ఏడాది నువ్వు సాధించే విజయాలు.. అడవిలో సింహం గర్జించినట్లు, ప్రపంచం మొత్తం మార్మోగిపోయేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చింది. మొత్తానికి భాగ్యశ్రీ పెట్టిన తాజా పోస్ట్‌తో ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? లేక అంతకుమించిన రిలేషన్ ఏమైనానా? అంటూ ఇంకా మరింత ఆసక్తికరంగా గుసగుసలా డుతోంది నెట్టిల్లు!






