16 May, 2026 | 2:09 AM

నాగబంధంలో లీలావతిగా..

16-05-2026 12:00 AM

అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోందీ చిత్రం. ఇందులో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సావ్నీ, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీశర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా జూలై 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘లీలావతి’ పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది. సంప్రదాయ చీరలో, గిరిజన సంప్రదాయ నగలు ధరించి కనిపించిన తీరు పాత్రలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది.