17 July, 2026 | 3:56 AM

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

06-06-2024 12:47 AM

జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్

గజ్వేల్, జూన్ 5: చిన్నారులకు ఎంసీపీ కార్డును అనుసరించి సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని, తల్లులకు వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతను వివరించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మం డలం గౌరారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లల ఆరో గ్య వివరాలను తెలుసుకున్నారు. పోషకాహార లోపం వల్ల అనేక వ్యాధులు కలుగుతా యని, చిన్నారులకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందేవిధంగా అంగన్‌వాడీలు శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్‌వాడీ కేం ద్రాల్లోని వంట గదుల్లో శుభ్రతను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ డీఎం హెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, కే రవీందర్ రెడ్డి, డేనియల్, డాక్టర్ మహతి, ఎంఎల్‌హెచ్‌పీ మాణిక్యమ్మ, ఏఎన్‌ఎం శ్రావణి, లత, ఆశ వర్కర్ సంతోష, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.