స్టాక్ మార్కెట్ పతనం...సెన్సెక్స్ 1300 పాయింట్లు పడిపోయింది
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంతో ముగిశాయి. సెన్సెక్స్ 1,312 పాయింట్లు పడిపోగా, మార్కెట్ విలువలో రూ.6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం వినియోగ మన్నిక గల వస్తువులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ & గ్యాస్, రియల్టీ స్టాక్‌లలో విస్తృత అమ్మకాల ఒత్తిడి, బలహీనమైన మార్కెట్ బ్రెడ్త్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ వంటి హెవీవెయిట్‌ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,312.91 పాయింట్లు పడిపోయి 76,015.28 వద్ద ముగియగా, నిఫ్టీ 360.30 పాయింట్లు క్షీణించి 23,815.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో భాగమైన 30 కంపెనీలలో ఏకంగా 26 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయగా, అదే సమయంలో, బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
ప్రధాని Narendra Modi బంగారం కొనుగోళ్లను తగ్గించాలని చేసిన పిలుపు తర్వాత జ్యువెలరీ స్టాక్స్‌పై ఒత్తిడి పెరిగింది.
ఇండియా విక్స్ 10 శాతానికి పైగా పెరగగా, నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లను తగ్గించాలని పిలుపునిచ్చిన తర్వాత జ్యువెలరీ స్టాక్స్‌లో తీవ్రమైన అమ్మకాలు జరగడంతో, వినియోగ మన్నికగల వస్తువులు (కన్స్యూమర్ డ్యూరబుల్స్) ఎన్‌ఎస్‌ఈ రంగాల సూచీలు దెబ్బతిన్నాయి. టైటాన్ కంపెనీ(Titan Company) దాదాపు 7 శాతం పడిపోగా, బలమైన నాలుగో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో (టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్)Tata Consumer Products దాదాపు 8 శాతం ఎగబాకి, నిఫ్టీలో అత్యధిక లాభాలను ఆర్జించిన సంస్థగా నిలిచింది.
స్టాక్ మార్కెట్ వార్తలపై మరిన్ని అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.






