calender_icon.png 18 July, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అమలుచేయండి

18-07-2025 12:27:34 AM

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణలో పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్) ప్రాజెక్టులను అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా (సీఐఎల్) లిమిటెడ్, నైవేలి లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా(ఎన్‌ఎల్‌సీఐఎల్) లిమిటెడ్ సంస్థలు ముందు కొచ్చాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుని సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అమలు చేయాలని సూచించారు.

ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ. 10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అస్కారం ఉందని తెలిపారు. లేఖలో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మద్దతు అవసరమన్నారు. దేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యం మరింత పెరగనుందని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.