calender_icon.png 18 July, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలపై కేటీఆర్ నజర్

18-07-2025 12:27:46 AM

- సిరిసిల్లలో నియోజకవర్గ నాయకులతో సమీక్ష

- రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఘాటు విమర్శలు

రాజన్న సిరిసిల్ల, జూలై 17 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు తన స్వంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలుండడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి సిరిసిల్ల ని యోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నాయకులతో విడివిడిగా సమీక్ష జరిపారు.

ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశనం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికలు. పెట్టడానికి భయపడుతున్నారని అంటూనే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురవేయాలని సూచించా రు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేడీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇం చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్ర భుత్వం అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని అన్నా రు. ఎన్నికల ముందు కాంగ్రెసోళ్ల కుడా గెలుస్తామని అనుకోలేదనీ, అనుకోకుండా వచ్చి న అధికారంతో వాళ్ళు ఆగం అయితున్నా రు, మనల్ని ఆగం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల ముం దు చెప్పులు పెట్టీ క్యూలో నిల్చునే రోజులు మళ్ళీ వచ్చాయన్నారు.

వ్యవసాయం పై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు, నారుమళ్లు వేసే సమయానికి ఎరువులు సిద్ధం ఉండేవన్నారు.కేసీఆర్ ఉన్నప్పుడు మన వాగులో నిండుగా నీళ్ళు ఉంటే, ఇప్పుడు ఎడారిని తలపిస్తుందన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అనేక ప్రాజెక్టులు, 15, రిజర్వాయర్లు ఉన్నా యి, 3బ్యారేజ్ లు, 21 పంపింగ్ సెట్ లు ఉ న్నాయన్నారు. కొండ పోచమ్మ సాగర్ వద్ద 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు తెచ్చిండు కేసీఆర్ ఒక్కో మోటార్ 139 మెగావాట్ల బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ద్వారా మనకు నీటి సరఫరా వ్యవస్థ తయారు చేశాడని అన్నారు.

24గంటల కరెంట్, రైతు బందు, రైతు భీమతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని, కాంగ్రెస్ హయంలో రూ.3 లక్షలున్న ధర, కేసీఆర్ నిర్ణయాలతో ఎకరానికి దాదాపు రూ30లక్షలు అయ్యాయన్నా రు. 2001 నుండి ఇప్పటివరకు మనకు సిరిసిల్ల లో ఏ ఎన్నికైన తిరుగులేదు ప్రతి కార్య కర్తకు నేను అండగా ఉంటానాని, మన ఎంపీటీసీ కుంటయ్య మరణం నన్ను తీవ్రం గా బాధించిందన్నారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, మన పార్టీ నుండి పోయిన నాయకులు, ఎ మ్మెల్యేలు మళ్ళీ వస్తానంటూ రాయభారం చేస్తున్నారనీ, వాళ్ళని తీసుకోవద్దని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారని అన్నారు.

ప్రతి ఎంపీటీసీ , జడ్పీటీసీ, అన్ని స్థానాల్లో మనమే గెల వాలని, రాష్ట్రంలోని 269 జడ్పీటీసీ స్థానా ల్లో మనం గెలవబోతున్నామని, నాయకులు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి విజయాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అ ధికార పార్టీకి ధీటుగా పని చేద్దాం మన గెలుపే వాళ్ళ బలుపుకు సమాధానమని అ న్నారు. బిసి రిజర్వేషన్లపై బీసీ సోదరులను మళ్ళీ కాంగ్రెస్ మోసం చేస్తుందని, పార్లమెం ట్ లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. 

బండి సంజయ్ బిసి రిజర్వేషన్ల నుండి ముస్లింలను తీసేయాలంటాడు, ఎంత సేపు మత విద్వేషాలు లేపడం తప్ప బండి సంజయ్ చేసింది ఏమి లేదన్నారు. రాష్ట్రంలో మనమే ప్రధాన ప్రతిప క్షం, బిసి డిక్లరేషన్ పై మనమే అందరికీ అవగాహన కల్పించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల లో మీరు నాకోసం పని చేసిండ్రు, ఇప్పుడు మీ గెలుపు కోసం నేను పనిచేస్తానని కేటీఆర్‌తెలిపారు.