calender_icon.png 18 July, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై రేవంత్ చెత్త వ్యాఖ్యలు

18-07-2025 12:26:32 AM

సీఎంపై హరీశ్ ఆగ్రహం

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మాజీమంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చే సిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చే శారు. ఢిల్లీలో సీఎం పక్కన ఉన్న వారంతా  గార్బేజ్ బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. గురువా రం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్ లో హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు.. ఢిల్లీలో ఉన్న కాలుష్యానికి తోడు రేవంత్‌రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగిందన్నారు.

రేవంత్‌రెడ్డి చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచారని మండిపడ్డారు. కేటీఆర్‌పై ఆరోపణల్లో రుజువు చూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అర్ధరాత్రి పోయి కలిసే అలవాటు రేవంత్‌కే ఉందని, కేటీఆర్‌కి లేదన్నారు. తమ పార్టీ నేతల ఫోన్లను రోజు ట్యాప్ చేస్తున్నారన్నారు.