16 August, 2026 | 3:18 PM

ఆకట్టుకుంటున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

15-08-2024 12:00 AM

మన దేశంలో గతంలో విధించిన అత్యవసర పరిస్థితుల్ని వివరిస్తూ సాగిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అప్పటి రాజకీయ నేతల పాత్రల్లో నటీనటులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ ద్వారా అవగతమవుతోంది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించగా, వాజ్‌పేయిగా శ్రేయస్ తల్పడే, జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్ కనిపించారు. బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీ చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిం ది. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.