9 May, 2026 | 1:44 AM

రాజకీయ నేతలనూ మెప్పించేలా..

09-05-2026 12:23 AM

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి‘. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో మూవీ టీమ్ పాల్గొంది.

ఈ కార్యక్రమం లో దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతు.. “ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనేది కథాంశం. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో హిందోళ చక్రవర్తి పోషించిన పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం.

సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్‌రావు నటించారు. ఈ సినిమాకు పాలిటిక్స్‌కు సంబంధం లేదు. వందశాతం సిన్సియర్‌గా చేసిన సినిమా ఇది. ఇది ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్‌ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్‌లోనూ ఇది బెస్ట్ స్క్రీన్‌ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. అన్ని పార్టీల వాళ్లకూ నచ్చే చిత్రమిది. వంద చిత్రాలకు కథా స్క్రీన్‌ప్లే రాసిన అనుభ వం నాకుం ది. నేను ఏం చేయ గలనో అదే ఈ చిత్రంలో చేశా” అన్నారు. ‘అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంద’ని హీరోయిన్ హిందోళ చక్రవర్తి చెప్పారు.