ఇంటి నిర్మాణంలో.. ప్రాథమిక వాస్తు సూత్రాలు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతిని ధి, జూన్ 22 (విజయక్రాంతి): ఇంటి నిర్మాణంలో వాస్తుది ఎనలేని పాత్ర. ప్లాట్ కొను గోలు దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మెజార్టీ ప్రజలు వాస్తు నిబంధనలు పాటిస్తారు. వాస్తు నిపుణుడిని సంప్రదించి వాస్తు నిబంధనలకు లోబడి తమ ఇంటిని నిర్మించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన ప్రాథమిక వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ వాస్తు సూత్రాలు..
చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ప్లాట్ నే కొనుగోలు చేయాలి. మూలలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండకూడదు. అలాగే ఏటవాలు ఉన్నా దానిని వదిలేయడమే బెటర్.- పూజగది ఇంటికి ఈశాన్యంలోనే ఉండాలి. దీపం ఆగ్నేయం వైపు, నీళ్లు ఈశాన్యం వైపు ఉంచాలి. పూజగదిలో నుంచి విరిగిపోయిన విగ్రహాలు, వెలిసిపోయిన ఫొటోలను తీసేయాలి. చనిపోయిన లేదా పూర్వీకుల ఫొటోలు నైరుతి వైపు ఉంచాలి. వీటిని పూజగది, బెడ్ రూమ్‌లో ఉంచకూడదు. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉత్తరం, తూర్పు లేదా ఈశా న్యం వైపు ఉండేలా చూసుకోవాలి. మాస్టర్ బెడ్ రూమ్ నైరుతి వైపు ఉండాలి. ఇందులో ఇంటి పెద్ద పడుకోవాలి. బాత్ రూమ్ కచ్చితంగా వాయువ్యం లేదా పడమర ప్రాంతం వైపు ఉండాలి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు రూఫ్ పైన నైరుతి వైపు ఉండాలి. సంపు ఈశాన్యంలో ఉంటే మంచిది.
ఇవి కూడా ముఖ్యమే..
ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు, ఫొటోలు కూడా వాస్తులో కీలకం. యుద్ధాలను ప్రతిబింబించే చిత్రాలు, విచారవదనంతో కూడి న పెయింటింగులు, దు:ఖం, కష్టాలు, హింస, విపత్తులకు సంబంధించిన పెయింటింగులు ఇంట్లో ఉండకూడదు. స్టోర్ రూమ్ వాయువ్యంలో ఉంటే నిత్యావసరాలకు ఎలాంటి లోటూ ఉండదు. ఇంటి కేంద్ర స్తానాన్ని బ్రహ్మస్థానం అంటారు. అక్కడ ఎలాంటి బరువులూ ఉండకూదు. గోడలు, మెట్లు, స్తంభాలు ఉండకూడదు. స్టడీ రూమ్ ఇంటికి తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. విద్యార్థి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి చదువుకోవాలి. స్టడీ రూమ్ కి పసుపు, నీలం, ఆరెంజ్, వయలెట్ వంటి వైబ్రెంట్ రుంగులు వేసుకో వాలి. స్టడీ రూమ్ దక్షిణం వైపు లేదా నైరుతి వైపు ఉంటే విద్యార్థికి ఏకాగ్రత లోపిస్తుంది. మీ ఇంటి పైన అదనపు అంతస్తు లేదా గది నిర్మించాలనుకుంటే అది నైరుతి లేదా పడమర వైపు కనిపించేలా ఉండాలి.






