1 August, 2026 | 3:42 PM

ఇద్దరు డెవలపర్లకు రెరా నోటీసులు

23-06-2024 02:30 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (విజయక్రాంతి): రెరాలో ప్రాజెక్టు నమో దు చేయకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు డెవలపర్లపై తెలం గాణ రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఫార్మాసిటీలోని బ్రిస్సా ప్రాజెక్టులో హస్తిన రియల్టీ ప్లాట్లు విక్రయిస్తోంది. సొనెస్ట్ ఇన్ ఫ్రా సంస్థ గచ్చిబౌలిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేపట్టింది. దీంతో హస్తిన రియల్టీ, సొనెస్ట్ ఇన్ ఫ్రా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ రెండు కంపెనీల ప్రతినిధులు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. రెరా చట్టం 2016 ప్రకారం ప్రతి ప్రమోటర్ తన ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాలి. రెరాలో నమోదు చేయకుండా వాటికి సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, ప్లాట్లు అమ్మడం లేదా అమ్మకానికి ఉన్నట్టు ఆఫర్ చేయడం రెరా నిబంధనలకు విరుద్ధం.