16 April, 2026 | 1:43 AM

ఇందిరమ్మ రాజ్యంలో పేదింటి కల నిజమైంది

16-04-2026 12:00 AM

ఇందిరమ్మ ఇల్లు ప్రారంబించిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ఏప్రిల్ 15(విజయక్రాంతి): చేవెళ్ల మండల పరిధిలోని దుద్దాగు గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన గూడెం చంద్రకళ, ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు గ్రామ సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న శేఖర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ... పేదల గృహ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు.

ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పల్లెల అభివృద్ధి వేగవంతం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేం దుకుకార్యాచరణ మొదలెట్టమని చెప్పారు. అంతేకాకుండా, పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలంటే సొంత ఇల్లు అత్యవసరమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెంటయ్య గౌడ్,చేవెళ్ల మండల నాయకులు, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్,మాజీ ఎంపీటీసీ న్యాలట బుచ్చయ్య, సింగప్పగూడెం, సర్పంచ్ రవి, తల్లారం దుద్దాగు ఉప సర్పంచ్ మొహమ్మద్ నవాజ్ వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.