13 July, 2026 | 9:48 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

మారేడుమిల్లి అడవుల్లో..

27-06-2024 12:05 AM

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్వయంభు’. దీంట్లో సంయుక్త, నభా నటేష్ కథానాయికలు. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఈ సినిమాలోని సాహసోపేతమైన పాత్రను పోషించేందుకు నిఖిల్ వ్యక్తిగతంగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో యుద్ధ వీరుడిగా కనిపించబోతున్న నిఖిల్ ఇందుకోసం ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న నిఖిల్ వ్యక్తిగతంగానూ సామాజిక జీవనంపై దృష్టి సారించినట్టు అర్థమవుతోంది.

ఇటీవల ప్రకాశం జిల్లా చీరాలలో మూతబడిన ఆలయాన్ని తెరిపించిన నిఖిల్.. పచ్చగా కళకళలాడే అడవిలో వ్యర్థాలను వదిలి వెళ్లవద్దంటూ మూవీ యూనిట్ సభ్యులను కోరారు. అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతపు సహజత్వాన్ని కాపాడే దిశగా చిరు ప్రయత్నమూ చేశారు. అక్కడ పారేసిన చెత్తను స్వయంగా తానే తొలగించారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతంలోనే. ‘స్వయంభు’ తాజా షెడ్యూల్ ప్రస్తుతం ఇక్కడే కొనసాగుతోంది. నిఖిల్‌పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది.