5 June, 2026 | 7:19 PM

యూనిక్ క్యారెక్టర్‌లో రామ్

14-10-2024 12:05 AM

రామ్ పోతినేని, మహేష్ బాబు పచ్చిగొల్ల కొలాబరేషన్‌లో సినిమాను దసరా సందర్భంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల యాక్షన్ ఓరియంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ సినిమాలో ఒక యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు మేకర్స్ తెలిపారు. రామ్ కూడా స్టులిష్ మేకోవర్‌లో కనిపించనున్నారని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు.