హింసాత్మక ప్రపంచానికి పూర్తి భిన్నంగా..
దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ మంచు ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా శుక్రవారం మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, ప్రభావవంతమైన పాత్రను సూచించే ఈ లుక్ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ వాతావరణంలో ఫైళ్లు, అధికారిక పత్రాల మధ్య కూర్చున్న కాజల్ పాత్ర కథలో కీలక ప్రాధాన్యతను చూపిస్తోంది. ఆమె చూపుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం పాత్ర ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి.
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌లో బాలకృష్ణ.. 1993 బాంబే నేపథ్యంలో కనిపించిన ఉత్కంఠ, హింసాత్మక ప్రపంచానికి భిన్నంగా ఉంది కాజల్ లుక్. ఆమె పాత్రలో కనిపించిన స్థిరత్వం, నిబద్ధత కథలో ప్రత్యేక ముద్ర వేయబోతున్నాయని టీమ్ పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.
ఈ చిత్రానికి అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవివర్మ, వీ వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.






