వీర జయధీర..
20-06-2026 12:28 AM
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వంలో ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రితు వర్మ ఇందులో కథానాయిక. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ చిత్రం గ్లింప్స్, టైటిల్ టీజర్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ను శుక్రవారం విడుదల చేశారు.
కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే భావోద్వేగ భరిత గీతమిది. సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ స్వరపర్చిన ఈ పాటను చంద్రబోస్ రాయ గా, దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్; ఎడిటర్: చోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: చిన్నా.






