ఈ వారం వార్తల్లో..
అకటా.. మహువా.. !
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు పశ్చిమ బంగాల్‌లో చేదుఅనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమానికి వెళ్తుండగా కొందరు నిరసనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇదే తరహా దాడి ఇటీవల పార్టీ అధినేత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం ఎదుర్కొన్నారు. మొత్తానికి.. అలా తృణమూల్ నేతలు ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అనుభవాలే చవిచూస్తున్నారు. అధికారాన్ని కోల్పోతే ఇంతేనా అనిపిస్తోంది.
చిట్టిచెల్లెలు తకైచి
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని సనాయ్ తకైచిని ప్రధాని మోదీ ఆప్యాయంగా తన ‘చిట్టిచెల్లెలు’ అని సంబోధించారు. ఢిల్లీ వేదికగా ఇరుదేశాల మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తకైచి సైతం మోదీని తన పెద్దన్నయ్యగా భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దేశాధినేతలు ఒక వేదికపై తమది అన్నాచెల్లెళ్ల బంధమని ప్రకటించుకోవడం ప్రపంచాన్ని ఆకర్షించింది.






